Wednesday, November 29, 2006

కవిత



పచ్చని పంట చేను లోని పల్లెకారు పాట తేట తెలుగు కవిత
వసంతం కోసం వేచి వేచి కూసే కోకిల పాట ఓ తీయని కవిత
చల్లని గాలికి మనలో కలిగే తెలియని ఆహ్లాదము మాటలలో తెలియపరిస్తే అది ఆహ్లాద కవిత
చిటపట చినుకులలో తడిచి పులకరించిన మేను పలికించే రాగం తన్మయ కవిత
సాగర తీరాన వీచే గాలికి శంకువు లోంచి వచ్చే ఆలాపన సాగర కవిత
ప్రియమైన వారిని తలచుకున్నప్పుడు తెలియకుండా వచ్చే ముసి ముసి నవ్వే ప్రేమ కవిత
నచ్చిన వారి ప్రేమ పొందకపోతే కలిగే బాధ లో వచ్చేది విషాద కవిత
మనసులొని భావాలను, ఊహలను అక్షరమాలగా చేరిస్తే, ఆదే భావ కవిత


సౌజన్య

No comments: