Tuesday, November 28, 2006

ఓ చందమామ



ఎన్నెన్ని నామాలు నీకు ఓ చందమామ
అన్నన్ని రూపాలు నీకు ఓ జాబిలమ్మ
ఎన్నెన్ని వర్ణాలు నీకు ఓ చందమామ
అన్నన్ని అందాలు నీకు ఓ జాబిలమ్మ
పడతులు పిలిచేరు నిను నెలరాజు అని
కాబోయే వారి రారాజుని నీలోన చూసుకొంటూ
పురుషులు పిలిచేరు నిను జాబిలమ్మ అని
వారి కలల రాణిని నీలోన ఆరాధిస్తూ
చిన్న పిల్లలు పిలిచేరు నిను చందు మామ అని
వారి మేనమామ లా బహుమతులు తెస్తావంటూ
ఈ విధంగా ఎన్నెన్ని నామాలు నీకు ఓ చందమామ
నీ చిననాటి రూపమేమొ నెలవంక
నీ పరువాన నీ రూపం అర్ధ వృత్తాకారం
నీ పరిపూర్ణ రూపమేమొ గుండ్రని భూమి రూపం
అన్ని రూపాలలో నీవు పంచేవు మాకు వెలుగు నీడలను
ఈ విధంగా ఎన్నెన్ని రూపాలు నీకు ఓ జాబిలమ్మ

నడి రేయి లోన నీవు తెల్లటి పాల తేట తెలుపు రంగు లో
వేకువఝామున నీవు ఈశ్వరుని మేని కి ఉన్న బూడిద రంగు లో
నిండు పున్నమి నాడు పచ్చని పసిడి రంగు లో కాసేపు
అమావాస్య నాడు చిక్కటి చీకటి లో కలిసిపొయే కారు నలుపు నీ రంగు
రూపానికో రంగు, కాలనికో రంగు
ఈ విధం గా ఎన్నెన్ని వర్ణాలు నీకు ఓ చందమామ

నెలవంక రూపాన నీ వయ్యారి వంపులే నీ అందం
అర్ధ చంద్రుని గా నీ ఆకర్షణే నీ అందం
నిండు పున్నమి రోజున నీవు వెదచల్లే చల్లని వెన్నెల నీ అందం
ఆ వెన్నెలకు విచ్చుకుని పరిమళించే కొలను లోని కలువలే నీకు మరీ అందం
ఈ విధం గా ఎన్నెన్ని అందాలు నీకు ఓ జాబిలమ్మ..............
సౌజన్య

No comments: