
నల్లని మబ్బులు కమ్మిన వేళ
వర్షపు జల్లులు కురిసిన వేళ
మది పులకరిస్తుంది, మరి నిన్ను తలుస్తుంది
చల్లని గాలులు వీచిన వేళ
పచ్చని పైరులు ఊగిన వేళ
మది పులకరిస్తుంది, మరి నిన్ను తలుస్తుంది
మల్లెలు చెట్టుకి పూచిన వేళ
వెన్నెల కాంతులు విరిసిన వేళ
మది పులకరిస్తుంది, మరి నిన్ను పిలుస్తుంది
-సౌజన్య
5 comments:
Chala chakkaga undi
nice kavitha
చాలా బాగుంది
చాలా అద్భుతమైన కవిత. ఎంత మధురమో , ఎంత సరళమో , పదాలు వృత్తాంతమున చాలా చక్కగా వాడారు మరియు ఈ కవితను మీరు అలవోకగా రాశారు...
చాలా చాలా బావుంది అద్భుతమైన కవిత
Post a Comment